Tuesday, December 12, 2006

[telugublog] Re: తెలుగు బ్లాగర్ల సంఘం అద్భుతమైన ఆలోచన.

ఇప్పుడు బ్లాగర్లు
చేస్తున్న ప్రచారము
విస్తృతము చెయ్యొచ్చు.
ఉదాహరణకి టపాలు ఒక పుస్తక
రూపములో తేవాలనుకోండి,
లేదా కంప్యూటరికి తెలుగెలా
నేర్పాలో అనే కరపత్రాలు
విస్తృతముగా
అందజెయ్యాలంటే. దానికి
కొంత ఆర్ధిక సహాయము అవసరము.
ఎవరైనా రిజిస్టర్డు
సంఘమంటే కొంత భరోసాతో
సహాయము చెయ్యడానికి
ముందుకొస్తారు వ్యక్తులకి
ఇవ్వటము కంటే. ఆదాయపు పన్ను
మినహాయింపంటే ఇంకా మంచిది.

మన కార్యక్రమాలన్నింటికి
ఒక వేదిక అవుతుంది.
సుబ్రమణ్యం గారన్నట్టు
ఎవరితోనైనా
మాట్లాడేటప్పుడు ఒక
ఊతాన్నిస్తుంది (పత్రికలు,
అధికారులు, నాయకులు). ఇంకా
మనకు డబ్బులెక్కువైతే
కొన్ని తెలుగు పరికారాలు
తయారుచెయ్యడానికి చేయూత
నివ్వొచ్చు. (ఉదాహరణకి
తెలుగు ఓసీఆర్, మరింత
మెరుగైన స్పెల్‌చెకర్,
గౌతమి కంటే అందమైన
యూనికోడ్ ఫాంట్లు
మొదలైనవి).

కానీ మీరన్నట్టు డబ్బుతో
పాటు చాలా బాధ్యతలు
వస్తాయి. విధి విధానలు
ముందే నిర్ణయించుకోవాలి.
కానీ ఈ విధానాలు చాలా
సరళంగా ఉండాలి. లేకుంటే
భాధ్యత నెత్తుకెత్తుకున్న
వాళ్లకి తలనొప్పి
అవుతుంది.


On Dec 12, 8:33 am, "Sudhakar S" <sudha...@gmail.com> wrote:
> నాకు బ్లాగర్ల సంఘం ఆలోచన ఇంకా అర్ధం కాలేదు. దాని వలన ఉపయోగాలు అర్ధము అవ్వటము
> లేదు :-(
>
> నాకుగా నేనుhttp://www.mugh.netఅనే సమూహాన్ని మరి కొందరితో కలసి
> నడుపుతున్నాము. దీనికి ఎటువంటి గుర్తింపు లేదు అయినా దాదాపు ఏడు వేల మంది
> సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు వందల మంది హాజరు అయ్యే
> సమావేశాలు, ప్రతి నెల నలభై మంది వరకూ హాజరయ్యే సమావేశాలు దీని ద్వారా
> జరుగుతాయి. ఇదంతా ఏ గుర్తింపు లేకుండానే. మాకూ ఈ 'గుర్తింపు' ఆలోచన వచ్చింది
> కానీ, దాని వలన వచ్చే భాధ్యతలను తలచుకుంటే భయం వేసింది.
>
> చరసాల గారన్నట్లు, ముందు అతి ముఖ్యమైనది అజెండా...ఏ పొరపాటు అడుగు పడినా, ధనంతో
> కూడుకున్న వ్యవహారం అన్ని రకాల నిందలనూ తెస్తుంది.
>
> ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
>
> -సుధాకర్http://sodhana.blogspot.com
>
> On 12/12/06, Prasad Charasala <charas...@gmail.com> wrote:
>
>
>
>
>
> > ఒక సంఘము అంటూ ఏర్పాటు చేయాలనుకుంటే దాని స్వభావమెలా వుండాలి, అది ఎందుకు
> > ఏర్పడాలి? దేని కొరకు ఏర్పాటు చేస్తున్నామో దాన్ని సంఘము కొనసాగించగలదా అనేది
> > చర్చించి చేయాలి. సంఘము ఏర్పాటు చేసేముందు ఇంకా కసరత్తు జరగాలి. నా వంతు నేను
> > కూడా పదివేల రూపాయల చందా ఇవ్వడానికి సుముఖమే! కాని "ఆంద్రులు ఆరంభశూరులు"
> > కాకుండా వుండాలంటే డబ్బును మించిన కట్టుబాటు అవసరం.
> > --ప్రసాద్
> >http://blog.charasala.com
>
> > On 12/12/06, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <sub.tadepa...@rediffmail.com>
> > wrote:
>
> > > తొందరగా ఆ పనేదో
> > > ముగిద్దాం.ఇప్పటికే చాలా
> > > ఆలస్యమైంది.నేను కూడా 10 వేల
> > > రూపాయల ప్రారంభిక చందా
> > > ఇవ్వడానికి కట్టుబడి
> > > ఉంటాను.మరి పేరు ఏం
> > > నిర్ణయించారు ? నేనయితే
> > > వెళ్ళిన చోటల్లా Telugu Blogging Community
> > > International లో సభ్యుణ్ణని పరిచయం
> > > చేసుకుంటున్నాను.(ఇంతవరకు
> > > అలాంటి సంస్థ ఏదీ
> > > లేకపోయినా)ఏదో ఒకటి
> > > చెప్పుకోవాలి గదా ! ఏం
> > > చెయ్యమంటారు ? సభ్యులకి
> > > గుర్తింపు కార్డులు కూడా
> > > ఏర్పాటు చేస్తే ఎలా
> > > ఉంటుంది ?--
> Thanks
> Sudhakar | సుధాకర్
> Savvy?  :http://sudhakar.wordpress.com
> తెలుగు :http://sodhana.blogspot.com

--~--~---------~--~----~------------~-------~--~----~
మీరు "telugublog" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home