Tuesday, December 12, 2006

[telugublog] Re: తెలుగు బ్లాగర్ల సంఘం అద్భుతమైన ఆలోచన.

ఒక సంఘము అంటూ ఏర్పాటు చేయాలనుకుంటే దాని స్వభావమెలా వుండాలి, అది ఎందుకు ఏర్పడాలి? దేని కొరకు ఏర్పాటు చేస్తున్నామో దాన్ని సంఘము కొనసాగించగలదా అనేది చర్చించి చేయాలి. సంఘము ఏర్పాటు చేసేముందు ఇంకా కసరత్తు జరగాలి. నా వంతు నేను కూడా పదివేల రూపాయల చందా ఇవ్వడానికి సుముఖమే! కాని "ఆంద్రులు ఆరంభశూరులు" కాకుండా వుండాలంటే డబ్బును మించిన కట్టుబాటు అవసరం.
--ప్రసాద్
http://blog.charasala.com

On 12/12/06, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <sub.tadepalli@rediffmail.com> wrote:
తొందరగా ఆ పనేదో
ముగిద్దాం.ఇప్పటికే చాలా
ఆలస్యమైంది.నేను కూడా 10 వేల
రూపాయల ప్రారంభిక చందా
ఇవ్వడానికి కట్టుబడి
ఉంటాను.మరి పేరు ఏం
నిర్ణయించారు ? నేనయితే
వెళ్ళిన చోటల్లా Telugu Blogging Community
International లో సభ్యుణ్ణని పరిచయం
చేసుకుంటున్నాను.(ఇంతవరకు
అలాంటి సంస్థ ఏదీ
లేకపోయినా)ఏదో ఒకటి
చెప్పుకోవాలి గదా ! ఏం
చెయ్యమంటారు ? సభ్యులకి
గుర్తింపు కార్డులు కూడా
ఏర్పాటు చేస్తే ఎలా
ఉంటుంది ?


--~--~---------~--~----~------------~-------~--~----~
మీరు "telugublog" గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది.
ఈ గుంపుకు జాబు పంపేందుకు, telugublog@googlegroups.com కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, telugublog-unsubscribe@googlegroups.com కు మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కొరకు, http://groups.google.com/group/telugublog వద్ద ఈ గుంపును చూడండి.

http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home